ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ 6వ వార్షిక గణాంకాల 2021 రిపోర్ట్‌ని విడుదల చేసింది. వరుసగా 6వ ఏడాది కూడా ఇండియా టాప్ డిష్‌గా బిర్యానీ నిలిచింది. 2021లో నిమిషానికి 115 లేదా సెకన్‌కు 2 బిర్యానీ ఆర్డర్లులు వచ్చాయని కంపెనీ తెలిపింది. చికెన్ బిర్యానీ హాట్‌ఫేవరెట్‌గా ఉంది. వెజ్ బిర్యానీ కంటే చికెన్ బిర్యానీ 4.3 రెట్లు ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయి. 4.25 లక్షల మంది కొత్త కస్టమర్లు చికెన్ బిర్యానీతోనే తమ ఆర్డర్లు ప్రారంభించారు. చెన్నై, కలకత్తా, లక్నో, హైదరాబాద్ స్విగ్గీ ఆర్డర్లలో చికెన్ బిర్యానీ టాప్ స్థానంలో ఉంది. ముంబైలో చికెన్ బిర్యానీ కంటే దాల్ కిచిడీకి రెట్టింపు ఆర్డర్లు వచ్చాయి. స్నాక్స్‌లో సమోసా టాప్ నిలిచింది. న్యూజిలాండ్ జనాభాకు సమానస్థాయిలో సమోసా ఆర్డర్లు 2021లో వచ్చాయి. జనవరి -డిసెంబర్ 2021 మధ్య ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌పై సరుకులు, పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ స్విగ్గీ జెనీ, హెల్త్హబ్పై విక్రయాలు, ఆర్డర్ల ఆధారంగా ఈ గణాంకాలను లెక్కగట్టినట్టు స్విగ్గీ వివరించింది.
ఈ ఏడాది సమోసా టాప్ స్నాక్‌గా నిలిచింది. గణాంకాల ప్రకారం.. స్విగ్గీపై నిమిషానికి 5 మిలియన్ల కుపైగా ఆర్డర్లు వచ్చాయి. అంటే న్యూజిలాండ్ జనాభాకు ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క సమోసా పంచే స్థాయిలో ఆర్డర్లు వచ్చాయి. 2.1 మిలియన్ ఆర్డర్లతో పావ్ భాజి ఇండియాలో రెండవ ఫెవరెట్ స్నాక్‌గా నిలిచింది. అయితే రాత్రి 10 తర్వాత ఆర్డర్లలో చీస్- గార్లిక్ బ్రెడ్, పాప్‌కార్న్, ఫ్రెంచ్‌ఫ్రైస్ ఎక్కువగా ఆర్డర్ ఇస్తున్నారు. ఇక గులాజ్ జాం ఆర్డర్లు ఏడాదిలో 2.1 మిలియన్లుగా ఉన్నాయి. రస్మలాయ్ ఆర్డర్లు 1.7 మిలియన్లుగా ఉన్నాయి. గ్రాసరీ ఆర్డర్ల విషయానికి వస్తే.. స్పెయి న్లో టమాటా ఫెస్టివల్‌కు 11 ఏళ్లపాటు సరిపోయే ట మాటాలను 2021లో ఇండియన్స్ ఆర్డర్ ఇచ్చారు. ట మా టాలు, అరటి పళ్లు, ఉల్లి, బంగా ళా దుంపలు, పచ్చిమిర్చిలు టాప్ – డెలివరీలుగా ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital