Sunday, December 1, 2024

TG| పుట్టుక నీది – చావు నీది.. బతుకంతా దేశానిది… కాళోజీకి రేవంత్ నివాళి

హైదరాబాద్ – ప్రజా కవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఘన నివాళులర్పించారు. ఈ మేర‌కు ఇద్ద‌రు నేత‌లు ఎక్స్ వేదిక ద్వారా పోస్ట్ లు పెట్టారు. ‘నిజాం నిరంకుశత్వానికి, దొరల దమననీతికి వ్యతిరేకంగా కలం ఎత్తిన యోధుడు కాళోజీ.., పుట్టుక నీది – చావు నీది బతుకంతా దేశానిది…అని సేవకు స్ఫూర్తి నింపిన మహనీయుడు’ అని కాళోజీ సేవలను సీఎం రేవంత్ కొనియాడారు.

తెలంగాణ వ‌ర్గాల గొంతుక – బండి సంజ‌య్
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం కాళోజీ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. ‘పుట్టుక నీది, చావు నీది…బ్రతుకంతా దేశానిది అనేంత గొప్పగా జీవించిన చైతన్య శీలి.. హక్కులకోసం, తెలంగాణ భాష, సంస్కృతుల కోసం నియంత నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన చలనశీలి… తెలంగాణ గొంతుకై నినదించిన ధీశాలి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు’.. అంటూ ఆయన్ను స్మరించుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement