Thursday, November 21, 2024

నార్సింగి ఫారెస్ట్‌ ట్రేక్‌ పార్క్‌లో ముగిసిన బర్డ్‌ వాక్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నార్సింగిలోని తెలంగాణ పోలీస్‌ అకాడమీ వెనుక ఉన్న ఫారెస్ట్‌ ట్రేక్‌ పార్క్‌లో బర్డ్‌ వాక్‌ (పక్షుల వీక్షణ) కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. మొదటి సారిగా ఈ పార్క్‌లో బర్డ్‌ వాక్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పక్షి ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ బర్డ్‌ వాక్‌లో సుమారుగా 30 రకాల పక్షులను సభ్యులు గుర్తించారు. బ్లూ ఫేసుడు మల్కోవా, కాపర్‌ స్మిత్‌ బార్బేట్‌, కామన్‌ అయోరా, ఏషియన్‌ కోయల్‌, వుడ్‌ సాండ్‌ పైపర్‌, షిక్రా వంటి పక్షులను గుర్తించారు.

అనంతరం ఎకో టూరిజం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్కైలాబ్‌ మాట్లాడుతూ పార్కులో ట్రెక్కింగ్‌ రూట్స్‌, ఎనిమిది వాకింగ్‌ పాత్‌, గజేబోలు, రచ్చబండలు, ఓపెన్‌ జిమ్‌ ఇలా ఎన్నో వసతులను కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు జి.చంద్రశేఖర్‌ రెడ్డి, సుమన్‌, లక్ష్మారెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement