Saturday, November 23, 2024

ప్రపంచంలోనే తొలిసారి మ‌నిషికి సోకిన బర్డ్‌ ఫ్లూ..చైనాలోనే..!

ప్రపంచంలోనే తొలిసారి చైనాలో మ‌నిషికి బర్డ్‌ ఫ్లూ సోకింది. పక్షులకు మాత్రమే వ్యాపించే బర్డ్‌ ఫ్లూ మనుషులకు కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చాలా కాలం నుంచి ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇప్పుడు చైనాలో అదే నిజ‌మైంది. చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లోని జెన్‌జియాంగ్‌ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్య‌క్తికి బర్డ్‌ ఫ్లూ సోకిందని ఆ దేశ‌ జాతీయ ఆరోగ్య కమిషన్  ఈ రోజు ఉద‌యం ప్ర‌క‌టించింది. వ్యాధుల గుర్తింపు నియంత్రణ (సీడీసీ) విభాగం వారం రోజుల క్రితం అత‌డికి రక్త పరీక్షలు చేయగా బర్డ్‌ ఫ్లూ సోకిన‌ట్లు నిర్ధారణ అయ్యిందని వివ‌రించింది. అత‌డిలో హెచ్‌10ఎన్‌3 స్ట్రెయిన్‌ వ్యాపించిందని ప్ర‌క‌ట‌న రావ‌డంతో చైనా వైద్యారోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది.

బాధితుడికి వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. అత‌డు ఇటీవ‌ల ఎవరెవరిని కలిశాడ‌నే విష‌యంపై ఆరా తీస్తున్నారు. ఇప్ప‌టికే గుర్తించిన‌ వారంద‌రినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి తక్కువగా ఉంటుందని, దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement