హైదరాబాద్, ఆంధ్రప్రభ: జేఎన్‌టీయుహెచ్ పరిధిలోని అన్ని అనుబంధ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని వర్సిటీ అధికారులు మరోసారి ఆదేశాలు జారీ చేశారు. గతంలోనే కళాశాలలకు అధికారులు ఆదేశాలు ఇచ్చినా మళ్లి తాజాగా రెండో సారి కూడా ఆదేశాలు జారీ చేశారు. అధికారులు కేవలం ఆదేశాలు ఇవ్వడమే కానీ దాని అమలు విషయంలో విమర్శలు వినిపిస్తున్నాయి.
కాలేజీల్లో బయోమెట్రిక్ పకడ్బందీగా అమలుకు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో టెక్నికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ.సంతోష్ కుమార్ ఆరోపించారు. కాగితాలపై కాకుండా ప్రత్యక్షంగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. సాంకేతిక విద్య బలోపేతం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.