Friday, November 22, 2024

డబ్ల్యూటీసీ ఫైనల్: ఈ నెల 25నుంచి బయోబబుల్లోకి టీమిండియా

ఇంగ్లండ్ గడ్డపై వచ్చే నెల 18 నుంచి ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్ల కు బీసీసీఐ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. భారత్ లో టీమిండియా ఆటగాళ్లకు ఈ నెల 25న బయోబబుల్ ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 2న ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టగానే భారత ఆటగాళ్లకు క్వారంటైన్ ఉంటుంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత కూడా భారత్ ఇంగ్లండ్ లోనే ఉంటుంది. ఎందుకంటే కోహ్లీ సేన ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.

కాగా, భారత ఆటగాళ్ల బృందాన్ని ఓ ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ తరలించనున్నట్టు బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఈ పర్యటనలో ఆటగాళ్ల కదలికలపై కఠిన ఆంక్షలు తప్పవని సూచనప్రాయంగా తెలియజేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్, టెస్టు సిరీస్ ల కోసం ఇంగ్లండ్ లో భారత ఆటగాళ్లు దాదాపు మూడున్నర నెలల పాటు ఉండాల్సి వస్తుంది. అందుకే ఆటగాళ్లతో పాటు వారి కుటుంబాలను కూడా ఇంగ్లండ్ తీసుకెళ్లేందుకు అనుమతినిస్తున్నట్టు బీసీసీఐ అధికారి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement