భారత వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ గేమ్స్ సిల్వర్ మెడలిస్ట్ బింద్యారాణి దేవి ఏసియన్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లోనూ సిల్వర్ మెడల్ సాధించింది. శనివారం నాడిక్కడ జరిగిన పోటీల్లో 55కేజీల విభాగంలో బింద్యారణి దేవి అదరగొట్టింది. తొలి ప్రయత్నంలోనే స్నాచ్ 80కిలోల బరువు లిఫ్ట్ చేసిన బింద్యా… ఆ తర్వాత రెండో ప్రయత్నంలో స్నాచ్ 83 కిలోల బరువును సౌకర్యంగా ఎత్తింది.
కానీ మూడో ప్రయత్నంలో ఆమె 85 కేజీల బరువు ఎత్తలేకపోయింది. మూడో ప్రయత్నంలో స్నాచ్ ఎత్తలేకపోయిన బింద్యా… క్లీన్ అండ్ జెర్క్‌లో రెండవ అత్యధిక బరువు 111 కేజీలు ఎత్తి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఈ పోటీలో చైనా క్రీడాకారిణి చెన్ గువాన్ లింగ్ 90కేజీలు బరువు ఎత్తి, ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించగా, వియత్నాంకు చెందిన ఖ్యున్హు రజతంతో సరిపెట్టుకుంది.