మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ గత ఏడాది మార్చి 13న వైదొలగిన విషయం అందరికి తెలిసిందే. అకస్మాత్తుగా బోర్డు నుంచి ఆయన తప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తోటీ ఉద్యోగినితో శారీరక సంబంధం పెట్టుకున్న కారణంగానే ఆయన బోర్డు నుంచి తప్పుకున్నారనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి. దీంతో బిల్‌గెట్స్ దంపతుల విడాకులకు కూడా కారణం ఇదే అయ్యిండొచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనాన్ని ప్రచురించింది. దీంతో ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్న ఓ ఉద్యోగినితో బిల్‌గేట్స్ అక్రమ సంబంధం పెట్టుకున్నారట. ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ బిల్‌గేట్స్ సెక్సువల్ రిలేషన్‌ను కొనసాగించాడట. ఈ విషయంలో బాధితురాలు స్వయంగా బోర్డుకు లేఖ రాయడంతో.. ఈ వ్యవహారంపై బోర్డు దర్యాప్తు జరిపించినట్టు తెలుస్తోంది. విచారణలో అది వాస్తవమే అని తేలడంతో మైక్రోసాఫ్ట్ బోర్డు నుంచి బిల్‌గేట్స్ అయిష్టంగా తప్పుకున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. మహిళా ఉద్యోగినితో బిల్‌గేట్స్‌కు ఉన్న వివాహేతర సంబంధాన్ని బిల్‌గేట్స్ అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించినట్టు తెలిపింది. వారిద్దరి మధ్య 20ఏళ్ల క్రితం ఈ సంబంధం ఉండేదని, 2020లో బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ ఉద్యోగినితో రిలేషన్‌లో ఉన్నారని.. అయితే దీనికి.. ఆయన బోర్డు నుంచి తప్పుకోవడానికి సంబంధం లేదని ఆ ప్రతినిధి తెలిపారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో.. వీరి బంధం బీటలు వారడానికి యాన్ విన్‌బ్లాడ్, ఝ షెల్లీ వాంగ్ అనే మహిళలు కారణం అయి ఉండవచ్చనే ఊహాగానాలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆయనకు మరో మహిళతోనూ ఎఫైర్ ఉందన్న వార్తలు వెలువడటం గమనార్హం. కాగా స్కూల్ ఫ్రెండ్ పాల్ అలెన్‌తో కలిసి 1975లో బిల్ గేట్స్ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించారు. అనతికాలంలోనే ఆ సంస్థ మెరుగైన ఫలితాలను సాధించింది. 1986లో పబ్లిక్ ఆఫరింగ్‌కు వచ్చిననాటికి అందులో గేట్స్ వాటా 49%.