ఢిల్లీ : ప్రధాని మోడితో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ శనివారం భేటీ అయ్యారు. ఆరోగ్య రంగం, పర్యావరణ మార్పులు వంటి కీలక అంశాలపై ఇరువురూ చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ప్రధానితో భేటీ వివరాల గురించి గేట్స్ తన అధికారిక బ్లాగ్‌లో రాశారు. భారత్ అన్ని రంగాల్లో రాణిస్తోందని పేర్కొన్నారు. భారత్ ఎంతో సమర్థమైన, భద్రమైన, అందుబాటు ధరల్లో ఉండే అనేక వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసిందన్నారు. భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
Delighted to meet @BillGates and have extensive discussions on key issues. His humility and passion to create a better as well as more sustainable planet are clearly visible. https://t.co/SYfOZpKwx8 pic.twitter.com/PsoDpx3vRG
— Narendra Modi (@narendramodi) March 4, 2023