Saturday, November 23, 2024

వయస్సు 80 ఏళ్లు, 14 సబ్జెక్టుల్లో మాస్టర్స్‌.. 24 డిప్లొమా పట్టాలు, దేశంలోనే తొలి వ్యక్తిగా రికార్డు

వయస్సు 80 ఏళ్లు.. ఛత్తీస్‌గడ్‌లోని బిలాస్‌పూర్‌ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.. జ్యోతిష శాస్త్రంలో ఎంఏ చేస్తున్న ఆయన పేరు ఎస్‌వీ పురోహిత్‌. పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, హిందీ, ఇంగ్లీష్‌, మహత్మా గాంధీ శాంతి పరిశోధనలు, అనువాదం-ఎడిటింగ్‌, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఏం, డిప్లమా ఇన్‌ సైబర్‌ లా, పీజీ డిప్లమా ఇన్‌ జర్నలిజం వంటి మొత్తం 14 సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ సంపాదించారు. దేశంలోనే తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. చదువుకు.. వయస్సుకు ఎలాంటి సంబంధం లేదని చాటి చెబుతున్నారు. 14 సబ్జెక్టుల్లో ఎంఏ చేసిన పురోహిత్‌.. 24 డిప్లొమా పట్టాలు పొందారు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాధించడమే లక్ష్యంగా తన తండ్రి ముందుకు వెళ్తున్నారని సునీల్‌ పురోహిత్‌ చెప్పుకొచ్చారు. తన తండ్రి పుస్తకాల పురుగు అని, చదవడం ఓ వ్యసనంలా మారిందని తెలిపాడు.

సరస్వతీ దేవీ ఆశీర్వాదంతోనే..

సరస్వతీ దేవీ ఆశీర్వాదంతోనే అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్టు ఎస్‌వీ పురోహిత్‌ చెప్పుకొచ్చారు. మరణం వరకు చదువు కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. చదువుతో గౌరవం లభిస్తుందన్న ఆయన.. హైకోర్టులో న్యాయమూర్తులు తనను గుర్తు పడుతున్నట్టు వివరించారు. 1962లోనే ఇంటర్‌ పూర్తి చేశానని, ఆ తరువాత ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్‌లో ఉత్తీర్ణత సాధించగా.. ఆర్థిక పరిస్థితులు బాగాలేక చదువుకోలేకపోయానన్నారు. తమ్ముడిని ఎంబీబీఎస్‌ చేయించగా.. తాను మాత్రం చదువును కొనసాగిస్తూనే ఉన్నా అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement