వైవిధ్యమైన సినిమాల హీరో విజయ్ ఆంటోనీ. గతంలో నకిలీ, డాక్టర్ సలీమ్ చిత్రాలతో ఆకట్టు-కున్న విజయ్ ఆంటోనీ
బిచ్చగాడుతో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. బిచ్చగా డుకు సీక్వెల్‌గా మరో సినిమాతో వస్తున్నాడు విజయ్. ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా తనే నిర్వర్తిస్తున్నాడు. బిచ్చ గాడు2 అనే -టైటిల్ తో పాటు- ‘బికిలి’ అనే -టైటిల్ కూడా పెట్టారు విజయ్ ఆంటోనీ. అయితే ఈ బికిలి అనే పదానికి అర్థం ఏంటీ- అంటూ కొన్నాళ్లుగా చాలామంది అడుగు తు న్నారు. దీనికి స్పష్టతనిస్తూ బికిలీ అనే పదానికి అర్థం చెబు తూ.. ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
పాటలో మొదట బికిలీ అంటే ఏంటీ- అనేదానికి వివరణ ఇస్తూ ‘నమస్కారం.. నేను విజయ్ ఆంటోనీని మాట్లాడుతు న్నాను. నేను బాగా ఆలోచించి ఆలోచించి.. ఏదో నా వల్ల అయిన ఒక కొత్త చెడ్డ పదాన్ని కనిపెట్టాను. చెడ్డపదం అంటే మీరనుకుంటు-న్నట్టు-.. మాట్లాడ్డానికి అసహ్యంగా ఉండే పదం కాదు. వినేవాళ్లకు అది అసహ్యంగా ఉండే పదం. నేను కనిపెట్టిన ఆ కొత్త పదం పేరు బికిలీ. పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకుని తన దగ్గరున్న ధనబలంతో వాళ్ల పొట్ట ను కొట్టి వాళ్లను బానిసలుగా మార్చి డబ్బుందన్న అహంకా రంతో తిరిగేవాడే బికిలీ. ఈ రోజు నుంచి నేను కనిపెట్టిన ఈ బికిలీ పదం.. భారతదేశంలో వాడకంలోకి వస్తుంది..’ అం టూ విజయ్ ఆంటోనీ చెప్పిన మాటలతో మొదలైన వీడియో సాంగ్.. ”వీళ్లే బికిలి బికిలి బిలి బిలి.. బికిలి బికిలి బిలి బిలి… అంటూ మొదలై.. మూవీ థీమ్ ను తెలియజేస్తూ.. కొందరికి హీరో ఎందుకు బికిలీ అనే పేరు పెట్టాడు” అనే వివరణ ఇచ్చే సాహిత్యంతో మాంటేజ్ సాంగ్ గా సాగుతోంది. ఈ గీతాన్ని కంపోజ్ చేసి, పాడటమే కాదు.. రాసింది కూడా విజయ్ ఆంటోనీయే కావడం విశేషం. ఈ వేసవి బరిలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో దేవ్ గిల్, హరీష్ పెరడి, జాన్ విజయ్, రాధా రవి, మన్సూర్ అలీ ఖాన్, వైజీ మహేంద్రన్, ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.