హైదరాబాద్, (ప్రభ న్యూస్) : హైదరాబాద్ కేంద్ర స్థానంగా కార్య కలాపాలు అందిస్తున్న బైక్ వో తన ఫ్లాగ్లిప్ మల్టి బ్రాండ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర డీలర్‌షిప్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తన వ్యాపారాన్ని ఆరంభించిన సంస్థ అనతికాలంలోనే 25 డీలర్లు, 15 డీలర్షిప్ స్టోర్లను ఆరంభించింది.
హైదరాబాద్‌తో పాటు కర్నూల్, గద్వాల్, రాజమండ్రి, నెల్లూరు, తణుకుల్లో షోరూంలను ప్రారంభించింది. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది చివరి నాటికి ఏపీతో పాటు తెలంగాణల్లో కొత్తగా 140 స్టోర్లను తెరవాలనుకుంటున్నట్లు కంపెనీ కో ఫౌండర్ విద్యాసాగర్ రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..