న్యూఢిల్లీ: దేశంలో అత్యంత పేద రాష్ట్రంగా బిహార్. ఆ తర్వాత జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలున్నాయి. నీతి ఆయోగ్ తాజా నివేదికలో వెల్లడైంది. కరోనా సంక్షోభం కోట్లాది మంది ప్రజలను పేదరికంలోకి నెట్టేసింది. నీతి ఆయోగ్ రూపొందించిన పేరదిక సూచీ 12 అంశాల ఆధారంగా భారత జాతీయ ఎంపీఐ (పావర్టీ ఇండెక్స్)ని రూపొందించింది. ప్రజల ఆరోగ్యం, విద్య, జవీవన విధానం వంటి మూడు కీలక అంశాలను బేరీజు వేసినట్లు పేర్కొంది.
పోషకాహారం, మరణాలు, పాఠశాల హాజరు, వంటగ్యాస్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, పక్కా ఇళ్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. నీతి ఆయోగ్‌నివేదిక ప్రకారం… అత్యంత పేదరాష్ట్రంగా బీహార్ నిలవగా, జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పేదల పరిస్థితి దయనీయంగా ఉంది. తెలంగాణలో 13.74 శాతం మంది పేదలు ఉన్నారు. రాష్ట్రాల జాబితాలో 18వ స్థానంలో నిలిచింది. తెలంగాణతో పోలిస్తే, ఆంధ్రప్రదేశ్ కాస్త మెరుగైన స్థానంలో ఉంది. 12.31 శాతం మందితో సూచీలో 20వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital