Tuesday, January 7, 2025

Bihar – ప్రశాంత్ కిషోర్‌ దీక్ష భగ్నం – అరెస్ట్

పాట్నా – బిహార్‌ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ తో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నజన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు..

రెండ్రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆయన్ను సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీ మైదాన్ నుంచి పీకేను బలవంతంగా అంబులెన్స్‌లోకి ఎక్కించారు. ఈ సమయంలో ఆయన మద్దతుదారులు తీవ్రంగా ప్రతిఘటించారు.

వందేమాతరం” నినాదాల మధ్యనే పాట్నా పోలీసులు పీకేను అదుపులోకి తీసుకుని అంబులెన్స్ లోకి ఎక్కించారు.

అంతకుముందు ప్రశాంత్ కిషోర్ సహా అతని 150 మంది మద్దతుదారులపై పాట్నా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇది చట్టవిరుద్ధమైన ఆందోళన అని పేర్కొన్నారు. పాట్నా హైకోర్టు ఆదేశాల ప్రకారం.. గర్దానీ బాగ్లోని నిర్దేశిత ప్రదేశంలో కాకుండా వేరే ప్రదేశంలో ధర్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ మతించకూడదని వెల్లడించింది. కానీ, ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదాన్ లో నిరసనకు దిగడంతో పోలీసులు అరెస్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement