బిగ్ బాస్ టైటిల్ తో బయటికి వచ్చాడు సింగర్ రేవంత్. కాగా ఆయన భార్య గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. అంతేకాదు తన బిడ్డను కలుసుకునే క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకుంది. అందుకే రేవంత్ కళ్లకు గంతలు కట్టి లోపలికి తీసుకెళ్లింది. పాప దగ్గరికి వెళ్లగానే కళ్ల గంతలు తీసి కూతురిని రేవంత్ చేతికి అందించింది. పాపను అపురూపంగా చేతిలోకి తీసుకున్న రేవంత్ ఎమోషనల్ అయిపోయాడు. బిడ్డను దగ్గరకు తీసుకుని మురిసిపోయాడు. ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో అతని ఫ్యాన్స్, నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ‘
క్యూట్ వీడియో’, ‘అమేజింగ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నెట్టింట్లో వైరలవుతోంది.అభిమానుల అంచనాలను, ఆశలను నిజం చేస్తూ బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు సింగర్ రేవంత్. తన గాత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానం చూరగొన్న గాయకుడు బిగ్ బాస్ హౌస్‌లోనూ తన చాతుర్యం ప్రదర్శించాడు. హౌస్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచే తనదైన ఆటతీరు, మాటలతో ఫ్యాన్స్‌ను ఆకట్టకున్నాడు. ఓవైపు ఫిజికల్ టాస్కుల్లో సత్తా చాటుతూనే మరోవైపు కావాల్సినంత ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ను అందించాడు. షో ప్రారంభంలోనే బిగ్‌బాస్ టైటిల్ గెలిచేది తానే అని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ అనుకున్నట్లు గానే ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.