బిగ్ బాస్ సీజన్ 8 విజేత ఎవరు అనే ఉత్కంఠ వీడింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన ఈ షోలో విజేత ఎవరో తేలిపోయింది. డా.గౌతమ్ కృష్ణ, సీరియల్ ఆర్టిస్ట్ నిఖిల్ మలయక్కల్ మధ్య జరిగిన పోటీలో, నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిలిచాడు.
ఇక, నేటి గ్రాండ్ ఫినాలేకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. కాగా, బిగ్‌బాస్-8 సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.55లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అలాగే, ప్రైజ్‌మనీతో పాటు విజేతకు బహుమతిగా మారుతీ డాజ్లర్ కారు ఇవ్వనున్నారు.