రాను రాను బిగ్ బాస్5 హౌస్ లో కంటెస్టెంట్ల గొడవలు..టాస్క్ లతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు బోర్ ఫీలయిన ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. కాగా బిగ్ బాస్ వెంటాడు వేటాడు అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా థర్మాకోల్ బ్యాగులు ధరించిన పోటీదారులు సర్కిల్ గీసి ఉన్న ట్రాక్ పై నడవాల్సి ఉంటుంది. గేమ్ పూర్తయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ థర్మాకోల్ మిగిలి ఉంటే వారే గెలిచినట్లు అని సూచించాడు బిగ్ బాస్.. ఈ టాస్క్ కు జెస్సీ సంచాలకులుగా వ్యవహరించాడు.. ముందుగా శ్రీరామ్, సన్నీ ఒకరినొకరు కిందకు తోసుకున్నారు. దీంతో ఇద్దరు కింద పడగా.. సన్నీ అవుట్ అంటూ ప్రకటించాడు
దాంతో తన స్నేహితుడి కోసం సన్నీ అవుట్ అయ్యాడంటూ శ్రీరామ్ సెటైర్ వేశాడు. దీంతో సన్నీ, శ్రీరామ్ మధ్య మాటల యద్ధం నడించింది. నువ్వు ఇండిపెండెంట్ ప్లేయర్ కాదని.. అందుకే ఓడిపోయినవ్.. అందుకే బయటున్నవ్ అంటూ పదే పదే సన్నీని రెచ్చగొట్టాడు శ్రీరామ్. అలాగే గాల్లో కిస్‌లు పంపుతూ గొంతు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ వార్నింగ్ ఇచ్చాడు శ్రీరామ్. ఇక తర్వాతి రౌండ్‌ను శ్రీరామ్, మానస్ ను కింద పడేయగా.. వారిద్దరూ అవ్ట్ అని ప్రకటించాడు జెస్సీ.. దీంతో సన్నీ మానస్ అవుట్ కాదంటూ జెస్సీ ముందున్న బ్యాగ్ ని తన్నేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాతి రౌండ్లో సిరి, యానీ మాస్టర్, షణ్ముఖ్ మిగిలారు.
దీంతో వారిద్దరూ యానీ మాస్టర్ ను టార్గెట్ చేశారు. ఇండివిడ్యువల్ గేమ్ లేదు.. నిజాయితీ లేదు. అంటూ సిరిని నెట్టేసింది.. దీంతో యానీ మాస్టర్ తనను కొరికిందంటూ సిరి ఏకంగా కత్తి పట్టుకుంది. వెంటనే.. ఇది తప్పంటూ సిరిని ఇంటి సభ్యులు వారించగా.. చాకు కిందపడేసింది. అందరూ గ్రూపులుగా ఆడుతున్నారని.. ఒంటరిగా ఆడి ఎలా కెప్టెన్ కావాలంటూ రెచ్చిపోయింది యానీ మాస్టర్.. దీంతో తనకు తానే గేమ్ నుంచి బయటకు వచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ సగం రోజులు గడిచేసరికి తెలివిగా ఆడుతున్నారు కంటెస్టెంట్స్. దాంతో ఈ షోకి మంచి రేటింగ్ కూడా రానుందనిపిస్తోంది.