స్టార్ మాటీవీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ షోకు మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే ‘బిగ్‌బాస్’ నాలుగు సీజన్లను విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు ఐదో సీజన్ ప్రారంభం అయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల్లోనూ సీజన్ 4 గ్రాండ్ సక్సెస్ కావడంతో సీజన్ 5ను కూడా విజయవంతం చేయడానికి నిర్వాహకులు కసరత్తు పూర్తి చేస్తున్నారు. వాస్తవానికి బిగ్‌బాస్ 5ను ఈ వేసవిలో ప్రారంభించాలని స్టార్ మా నిర్వాహకులు భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా అది వాయిదా పడింది.
కానీ ఇప్పుడు ఐదో సీజన్‌ను షురూ చేయడానికి నిర్వాహకులు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అందులో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌ను జూమ్ ద్వారా ఇంటర్వ్యూ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వారం పదిరోజుల్లో ఫైనల్ కంటెస్టెంట్స్‌ను ఖరారు చేసి, వారిని క్వారంటైన్లో ఉంచి తర్వాత సీజన్‌ను స్టార్ట్ చేస్తారట. అన్ని అనుకున్నట్లు జరిగితే జూలై రెండో వారంలో బిగ్‌బాస్ ఐదో సీజన్ ప్రారంభం కానునట్లు తెలుస్తోంది. ఈ సారి మరింత కొత్తగా షోని నడిపించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. పాపులర్ అయిన నటీనటులను మాత్రమే షోలోకి తీసుకోబోతున్నారట.
ఇక ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుండటంతో కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సీజన్లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్ ప్రవీణ్, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో హైపర్ ఆది, శేఖర్ మాస్టర్, మంగ్లీలు వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో వాళ్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తారా లేదా అనేది కాస్త అనుమానమే. ఇక ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవరిస్తాడని తెలుస్తోంది.