బుల్లితెర మెగా రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొదట్లోనే కాకరేపుతోంది. ఈ సారి 19 మంది కంటెస్టెంట్స్ తో హౌస్ లో సందడి వాతావరణం కనిపిస్తోంది. అంతేకాదు షో మొదలైన మొదటి రోజు నుంచే కంటెస్టెంట్స్ ల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. బోల్డ్ బ్యూటీ లహరి ఆర్జే కాజల్ లు కాంప్రమైజ్ కాగానే మరో కంటెస్టెంట్ హామీదాతో, లహరి గొడవపడ్డారు. హమీదాని చూసి మొదట్లో అమాయకురాలని అంచనాకు వచ్చారు. కాని ఆమె రోజురోజుకి తన గడుసు తనం చూపిస్తుంది. లహరితో పదే పదే గొడవలు పడుతుంది. నేనేదైనా అడిగితే ఎందుకు సరిగా సమాధానం ఇవ్వవని లహరి హమీదాను ప్రశ్నించింది. కానీ హమీదా తనను బేఖాతరు చేస్తూ నా ఇష్టం, నేనిలాగే మాట్లాడతానని దురుసుగా వ్యవహరించింది. అయితే ఆ తర్వాత ఇద్దరు కాంప్రమైజ్ అయి ఫ్రెండ్స్‌లా మారారు.
ఆలూ కూర తనకు వడ్డించకుండా ఫ్రిజ్‌లో పెట్టారని యానీ మాస్టర్ మీద మండిపడింది ఉమాదేవి. నేను అడిగినప్పుడు కూర లేదన్నారు, మరి ఇప్పుడెలా ఉందని నిలదీసింది. నేను బిచ్చం అడుక్కోవడానికి రాలేదంటూ ఫైర్ అయింది. గత సీజన్లో కరాటే కళ్యాణి.. అరియానా గ్లోరిల మధ్య ఇలాంటి గొడవే జరిగింది. తనకు ఆలూ కూర పెట్టమంటే పెట్టలేదని ఫీల్ అయిపోయిన అరియానా ఏకంగా ఆ తరువాతి వారంలో కరాటే కళ్యాణిని నామినేట్ చేసి ఇంటికి పంపేసింది. మరీ ఈ సారి ఉమాదేవి యానీ మాస్టర్ ని నామినేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
ఇక హౌస్ లో డింభకా టాస్క్‌లో కాస్త ఇంట్రెస్ట్ గా సాగుతోంది. ఈ టాస్క్ ని సిరి గెలుపొందగా ఆమె ఇద్దరు ఇంటిసభ్యులను ఎంచుకుంది. షణ్ముఖ్‌ను యజమానిగా, లోబోను సేవకుడిగా ఎంచుకొని సిరి బిగ్ బాస్‌తో పాటు ఇంటి సభ్యులకు చెప్పింది. అయితే తనకు దొరికిన అవకాశాన్ని లోబో చక్కగా ఉపయోగించుకున్నాడు.అందరు హౌజ్‌మేట్స్ మాదిరిగా మిమిక్రీ అద్భుతంగా చేసి చూపించాడు. ఇక షణ్ముఖ్ బట్టలను లోబో ఉతుకుతుండా యాంకర్ రవి వచ్చి ఫన్ క్రియేట్ చేశాడు. మొత్తానికి లోబో తనదైన స్టైల్లో తెగ నవ్విస్తున్నాడు.
ఇది కూడా చదవండి: అడగాల్సింది ఎవర్ని?: మోహన్ బాబుకు నాగబాబు కౌంటర్