భారత్‌లో అతిపెద్ద ఆన్‌లైన్ సూపర్ మార్కెట్ బిగ్ బాస్కెట్ తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కాకినాడ నగరాల్లో సైతం తమ డెలివరీ సేవలను ప్రారంభించింది. గత కొన్ని నెలల కాలంలో పది కొత్త టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించాలనే కంపెనీ వ్యూహంలో ఇది భాగంగా తెలిపింది. బిగ్ బాస్కెట్ సేవలు ఇప్పుడు భువనేశ్వర్, గువాహటి, జంషెడ్‌పూర్, కోట, నాసిక్, కొల్హాపూర్, ప్రయాగ్‌రాజ్, అమరావతిలో సైతం లభ్యం కానున్నాయి. బిగ్ బాస్కెట్ టైర్-2 సిటీస్ నేషనల్ హెడ్ శశి శేఖర్ మాట్లాడుతూ.. కంపెనీ రికార్డు స్థాయిలో నెలకు 7 మిలియన్‌ల వినియోగదారుల ఆర్డర్లను నమోదు చేస్తుంది. కరోనా కాలంలో ఈ డిమాండ్ మరింత పెరిగింది. ఏపీలోని అమరావతి కంపెనీకి ఎంతో కీలకమైన మార్కెట్. కాకినాడ, ఏపీలో ఆరో అతిపెద్ద నగరం. అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా కొనసాగుతున్నది. తక్కువ కాలంలో.. ఎక్కువ నగరాలకు తమ సేవలను విస్తరింపజేశాం.
సౌకర్యవంతమైన డెలివరీ..
సేవలు ప్రారంభించనప్పటి నుంచి కాకినాడ, రాజమండ్రిలో 7వేలకు పైగా డెలివరీ సేవలు అందించాం. ఆన్ టైమ్ డెలివరీ, ఎలాంటి ప్రశ్నలు అడగని రీతిలో రిటర్న్ పాలసీ, సరసమైన ధరలతో పాటుగా విస్తృత శ్రేణి ఉత్పత్తుల లభ్యత వంటి అంశాలు ఎంతో కీలకం. రిటెన్షన్ రేటు నిలుపుకోవడంతో పాటు బాస్కెట్ పరిమాణం పెద్ద సంఖ్యలో సాధించేందుకు ఎంతో తోడ్పాటు అందుతుంది. సౌకర్యవంతంగా.. సురక్షితంగా ఇంటి వద్ద నుంచే కోరుకున్న వస్తువులు పొందొచ్చు. త్వరలోనే మరిన్ని నగరాలకు ఈ సేవలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం. కచ్చితమైన నాణ్యత, తగిన సేవలు, సురక్షితంగా ఉత్పత్తులను డెలివరీ చేయడం ద్వారా వినియోగదారుల నడుమ నమ్మకాన్ని బిగ్ బాస్కెట్ పొందింది. కరోనాను దృష్టిలో పెట్టుకుని కంపెనీ డిస్ ఇన్‌ఫెక్టింగ్, శానిటైజింగ్ వర్క్ స్టేషన్లు, వేర్ హౌస్‌లు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన యంత్ర సామాగ్రిని కూడా క్రమ పద్ధతిలో సమకూర్చుకుంటున్నది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..