మహిళల టీ20 ప్రపంచకప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో భారత మహిళల జట్టు గెలుచుకుంది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. శ్రీలంక ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించని భారత్.. శ్రీలంకను 100 పరుగుల లోపుకే ఆలౌట్ చేసింది. దీంతో 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. అలాగే, మహిళల టీ20 ప్రపంచకప్‌లో పరుగుల పరంగా భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం.
శ్రీలంక బ్యాటర్లలో కవిషా దిల్హరి (21), అనుష్క సంజీవని (20), అమ కాంచన (19) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. భారత బౌలర్ల ధాటికి మిగిలిన వారు పెవిలియన్‌కు వరుసగా క్యూ కట్టారు. దీంతో శ్రీలంక జట్టు 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది.
భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి, ఆశా శోభన మూడు వికెట్లు దక్కించుకున్నారు. రేణుకా సింగ్ రెండు వికెట్లు తీయగా… శ్రేయాంక పాటిల్, దీప్తి శర్మ తలో వికెట్ పడగొట్టారు. కాగా, ఈ ఓటమితో శ్రీలంక జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అంతకముందు బ్యాటింగ్ చేసిన దాంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 172/3 పరుగులు సాధించింది. కెప్టెన్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 8ఫోర్లు, 1సిక్స్ *52 నాటౌట్), వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (38 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్ *50) అర్థ శతకాలతో విజృంభించారు. ఇక ఓపెనర్ షఫాలీ వర్మ (43) పరుగులతో రాణించింది. దాంతో భారత స్కోర్ భారీగా వెల్లింది.