Thursday, November 21, 2024

యూజ‌ర్స్‌కి బిగ్ అప్‌డేట్‌.. న‌థింగ్ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14బీటా

యూకే బేస్ట్ టెక్ బ్రాండ్ నథింగ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో న‌థింగ్ ఫోన్ (1) స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. నథింగ్ ఫోన్ (1) మోడల్ ప్రీమియం డివైజ్‌గా పాపులర్ అయింది. కాగా, ఈ కంపెనీ తాజాగా ఫోన్ మార్కెట్ లో ఓ ఘనత సాధించింది. ఆండ్రాయిడ్ 14 బీటాకు యాక్సెస్ పొందినట్లు వెల్లడించింది.. ఈ ఘనత సాధించిన మొదటి గూగుల్ ఆండ్రాయిడ్ పార్ట్నర్‌గా నిలిచినట్లు కంపెనీ పేర్కొంది.

గూగుల్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 14. ఇది యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపర్చనుంది. జెస్టర్ నావిగేషన్, లొకేషన్ బేస్డ్ లాయల్టీ కార్డ్ సజెషన్స్, ఇంప్రూవ్డ్ PIN యానిమేషన్స్ వంటి ఎన్నో సరికొత్త ఫీచర్లు కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ అప్‌డేట్‌ను రిలీజ్ చేసే టైమ్‌లైన్‌ను నథింగ్ కంపెనీ షేర్ చేయలేదు. నథింగ్ ఫోన్ (1) మోడళ్లకు ఆండ్రాయిడ్ 14 బీటా యాక్సెస్ లభిస్తుందంటే.. బ్రాండ్ ఈ ఏడాది చివర్లో స్టెబుల్ నథింగ్ OS అప్‌డేట్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో కంపెనీ నథింగ్ ఫోన్ (2)ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ కొత్త ఆండ్రాయిడ్ 14 ఓఎస్ అప్‌డేట్స్‌తో మార్కెట్‌లోకి వస్తుందా లేదా అనే విషయంపై కంపెనీ స్పందించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement