Monday, January 20, 2025

TG | అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో బిగ్ ట్విస్ట్..

  • దొరకని బీదర్ దొంగల ఆచూకీ
  • పోలీసులకు తలనొప్పిగా మారిన కేసు
  • సెర్చ్ ఆపరేషన్ లో నాలుగు రాష్ట్రాల పోలీసులు

అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. అమిత్ గ్యాంగ్ గానీ.. మనీష్ గ్యాంగ్ గానీ కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు భావించ‌గా… ఇప్పుడు అది వారు కాదని పోలీసులు నిర్ధారించారు. బీహార్ పోలీసుల సమాచారం మేరకు తొలుత మనీష్ ముఠాగా నిర్ధారించి గాలింపు చ‌ర్య‌లు మొద‌లు పెట్టారు.

అయితే విచార‌ణ‌లో భాగంగా బీహార్ పోలీసులు బీదర్ పోలీసుల సీసీటీవీ ఫుటేజీని… మనీష్ తల్లిదండ్రులు, గ్రామస్తులకు చూపించగా.. ఆ ఫుటేజిలో ఉంది మనీష్ కాదని వారు చెప్పారు. దీంతో ఈ స్టోరీ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితుల వివరాలు ఇంతవరకు తెలియకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

తెలంగాణ, కర్ణాటక, బీహార్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. బీదర్ తో పాటు హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నేరస్తులను గుర్తించే పనిలో ఉన్నారు.

అయితే, పక్కా ప్లాన్ ప్రకారమే మొత్తం ఆపరేషన్ లో ఒక్కసారి కూడా మొబైల్ ఫోన్ వాడకుండా ఇద్దరు దుండగులు జాగ్రత్త పడ్డారు. బ్యాగులు, బట్టలు, హోటల్ బిల్లులు, ప్రయాణ టిక్కెట్లు దగ్గర నుంచి తినే తిండి వ‌ర‌కూ ప్రతి సందర్భంలోనూ ఆన్‌లైన్ లావాదేవీలు లేకుండా నగదు మాత్రమే వినియోగించారు. నిందితులు మొబైల్ ఫోన్ కూడా వినియోగించకపోవడం కూడా విచారణలో పోలీసులకు ఇబ్బందిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement