Tuesday, November 19, 2024

Big Story: శ్రీలంక హెచ్చరికలు.. సంక్షోభంలో దేశ ప్రజలు

శ్రీలంకను కుదిపేస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, బలహీన ఆర్థిక వ్యవస్థలతో ద్రవ్యోల్బణం వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్న ఇతర దేశాలకు ఒక హెచ్చరికగా మారింది. ప్రపంచవ్యాప్తంగా 94 దేశాల్లోని 1.6 బిలియన్‌ ప్రజలు ఆహారం, చమురు, ఆర్థిక రంగాల్లో కనీసం ఏదో ఒక సంక్షోభాన్ని అయినా చవిచూస్తున్నారు. 1.2 బిలియన్ల ప్రజలు కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఈ ఏడాది జూన్‌లో ఐక్యరాజ్యసమితి గ్లోబల్‌ క్రైసిస్‌ రెస్పాన్స్‌ గ్రూపు సెక్రటరీ జనరల్‌ ప్రకటించారు.
శ్రీలంకలో ఆహారం, ఇంధనం కొరత తీవ్రస్థాయిలో ఉంది. ఇంధన కొరతతో స్కూళ్లు మూతబడ్డాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి ఇంధనం లేకపోవడంతో స్కూళ్లు మూతబడ్డాయి. అతికష్టం మీద లంక ప్రభుత్వం ఇంటర్నేషనల్‌ మానెటరీ ఫండ్‌ ద్వారా బాలియట్‌ను ఏర్పాటు చేయగలిగింది. దీంతో, శ్రీలంక ఆర్థిక సమస్యలు తేటతెల్లమవుతున్నాయి. అయితే, ఇది ఒక్క శ్రీలంక సమస్య మాత్రమే కాదు. ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ఫ్యూయల్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. లావోస్‌, పాకిస్థాన్‌, వెనుజులా, గునియాల వరకు ఆర్థిక సంక్షోభ ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఆహారం, ఇంధనం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. కరోనా తర్వాత పుంజుకుంటున్న టూరిజం, ఇతర వ్యాపారాలను రష్యా ఉక్రెయిన్‌ల యుద్ధం తలక్రిందులు చేసింది. దీంతో, అభివృద్ధి చెందుతున్న దేశాల 5 శాతం ఆదాయం తగ్గిందని ప్రకటించింది.

అమెరికా మరియు నాటో కూటమి ఆఫ్ఘనిస్థాన్‌లో, సాయుధ బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లింది. విదేశాల సాయం అందక, తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించక పోవడం వంటి చర్యల కారణంగా సుమారు 39 మిలియన్ల మంది ప్రాణభయంతో బ్రతుకీడుస్తున్నారు. సివిల్‌ సర్వెంట్స్‌ సైతం ఆహారభద్రతపై ఆందోళన చెందుతున్నారు. డాక్టర్లు, నర్సులు, టీచర్లతో పాటు అన్ని రంగాల వారికి కొన్ని నెలలుగా జీతాలు అందడం లేదు. ఇటీవల జరిగిన భూకంపంలో వెయ్యిమందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనలతో ఆఫ్ఘనిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ చితికి పోయింది. అర్జెంటీనాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది ప్రతి పదిమంది అర్జెంటీనియన్లలో నలుగురు పేదరికంలో మగ్గుతున్నారు. విదేశీమారక నిల్వలు అత్యల్పంగా ఉండడంతో, సెంట్రల్‌ బ్యాంకు వద్ద కరెన్సీ లేదు. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 70 శాతానికి పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అర్జెంటేనియన్లు ఎక్కువ శాతం సూప్‌ కిచెన్ల పైన, ప్రభుత్వ సంక్షేమ పథకాల పైన ఆధారపడి జీవిస్తున్నారు. ఈజిప్ట్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రైవేటీకరణతో దేశ జనాభాలో మూడొంతుల మంది 103మిలయన్లు పేదరికంలో మగ్గుతున్నారు. లావోస్‌, లెబనాన్‌, మయన్మార్‌, పాకిస్థాన్‌, టర్కీ,, జింబాబ్వే, లు కూడా తీవ్ర దుర్భిక్షంలో ఉన్నాయి. ఈ దేశాలు కూడా త్వరలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించే అవకాశం లేకపోలేదని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement