Friday, November 22, 2024

Breaking: పేటీఎంకు బిగ్ షాక్.. ఫాస్టాగ్ జారీ నిలిపివేత

డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎంకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆర్‌బీఐ ఆంక్షలతో ఇబ్బందుల్లో ఉన్న కంపెనీకి తాజాగా ఎన్‌హెచ్ఏఐ షాక్ ఇచ్చింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్ఏఐ) ఫాస్టాగ్ సేవల కోసం అనుమతిచ్చిన 30 ఆథరైజ్‌డ్ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కంపెనీపై నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌హెచ్ఏఐ పేర్కొంది.

ఫాస్టాగ్ యూజర్లు టోల్ రుసుమును చెల్లించేందుకు, ఇబ్బందులు పడకుండా ప్రయాణించేందుకు తాము పేర్కొన్న బ్యాంకుల నుంచే ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాలని ఎన్‌హెచ్ఏఐ తరపున టోల్ ఫీజు వసూలు చేస్తున్న ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) వెల్లడించింది. ఐహెచ్ఎంసీఎల్ పేర్కొన్న జాబితాలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్‌బీఐ సహా మొత్తం 32 బ్యాంకులు ఉన్నాయి. ఇందులోంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకును తొలగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement