Saturday, November 23, 2024

Nagam Janardana Reddy | కాంగ్రెస్​కు బిగ్‌ షాక్‌.. నాగం రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న నాగం జనార్దన్​రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ కేటాయించలేదు. దీనిపై కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, జానారెడ్డి లాంటి నేతల దృష్టికి తీసుకెళ్లినా టికెట్​ విషయంలో హామీ దక్కలేదు. కాగా, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు, రాజేష్ రెడ్డికి ఆకస్మికంగా కాంగ్రెస్ టికెట్ కేటాయించింది.

దీంతో ఆగ్రహానిక గురైన నాగం.. ఇప్పటికే పలుమార్లు మీడియా సమావేశంలో అనుచరులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. చివరకు తన అనుచరుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఆదివారం తన రాజీనామా లేఖను పంపించారు. పార్టీలో జరిగిన అవమానాలను, కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలను ఈ లేఖ ద్వారా తన అనుచరులకు, ప్రజలకు నాగం స్పష్టత ఇచ్చారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలో నాగం చేరుతారని తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement