బీఆర్ఎస్కు పెద్ద షాక్ తగిలింది. వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమే పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు. బీఆర్ఎస్పై అవినీతి, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల కారణంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కావ్య ప్రకటించింది. బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్కు లేఖలో కృతజ్ఞతలు తెలిపారు.
‘‘గత కొద్ది రోజులుగా పార్టీ నాయకత్వంపై అవినీతి ఆరోపణలు, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, మద్యం కుంభకోణాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలో నేతల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, నేతల మధ్య సహకారం లేకపోవడం వల్ల పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని, ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. పార్టీ అధినేత కేసీఆర్, కార్యకర్తలు నన్ను క్షమించాలని’’ అని లేఖలో కడియం కావ్య పేర్కొన్నారు.