Sunday, November 17, 2024

Flipkart | ప్రారంభమైన “బిగ్ సేవింగ్ డేస్”.. కళ్లు చెదిరే ఆఫ‌ర్లు, భారీ డిస్కౌంట్లు.. వివరాలివే !

దేశంలో ప్ర‌ముఖ‌ ఆన్ లైన్ ఈ-కామర్స్‌ సంస్థ అయిన ఫ్లిప్‌కార్ట్ మరోక సారి అధిరిపోయే ఆఫ‌ర్ల‌తో సేల్ ప్రారంభించింది. “బిగ్ సేవింగ్ డేస్” పేరుతో ఈ సారి మరోక సేల్ ప్రారంభించింది. ఇవ్వాల (శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటల నుంచి మొద‌లైన ఈ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆరు రోజుల పాటు అంటే ఆగష్టు 09 వరకు వరకు జ‌ర‌గ‌నుంది.

ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను అందించనుంది ఫ్లిప్‌కార్ట్. ఇందులో ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి కొత్త డీల్స్ ని అందించినుంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాలపై 80 శాతం వరకు, టీవీస్ & అప్లయన్సెస్ పై 75 శాతం వరకు, ఫ్యాషన్ పై 50 నుంచి 80 శాతం వరకు, ఫర్నిచర్ అండ్ మ్యాట్రెస్స్ 80 శాతం వరకు, ఫ్లిప్‌కార్ట్ ఒరిజినల్స్ పై 80 శాతం వరకు డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ అందించనుంది.

దీంతో పాటు క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్లను కూడా అందించ‌నుంది. అదే విధంగా డెబిట్ కార్డుపై ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది. వీటితో పాటు వివిధ బ్యాంకులు, బజాజ్ ఫిన్సర్వ్ అందించే నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్, ఫ్లిప్ కార్ట్ పే లేటర్ లాంటి సర్వీసులు కూడా అందుబాటులో ఉండనున్నాయి.

ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో పాటు కోటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే.. 10 శాతం డిస్కౌంట్ అభించ‌నుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసే వారికి 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ ను అందించనుంది ఫ్లిప్ కార్ట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement