బ్రిటన్ ప్రధానమంత్రిగా కేవలం 45 రోజులు పని చేసినా లిజ్ ట్రస్‌కు జీవితాంతం అత్యధిక మొత్తంలో భత్యం పొందనున్నారు. మాజీ ప్రధానిగా లిజ్‌ట్రస్ జీవితాంతం ఏడాదికి రూ. కోటి భత్యం పొందనున్నారు. మాజీ ప్రధానమంత్రులు ప బ్లిక్ లైఫ్‌లో విధులను కొనసాగించడానికి ఏర్పాటైన పబ్లిక్ డ్యూటీ కాస్ట్స్ అలవెన్స్ (పీడీసీఏ) నుంచి లిజ్‌ట్రస్‌కు ఈ భత్యం అందనుంది. బ్రిటన్ ప్రధానమంత్రుల చరిత్రలో అతితక్కువ కాలం ప్రధానిగా పని చేసిన లిజ్‌ట్రస్ ప్రధాని పదవికి గురువారం రాజీనామా చేశారు. మాజీ ప్రధాని లిజ్‌ట్రస్‌కు జీవితకాలం వార్షిక భత్యంగా లభించే కోటి రూపాయలు ట్యాక్స్ చెల్లింపుదారులు చెల్లించే డబ్బు నుంచి అందనుంది.
ప్రధాని కార్యాలయం ఖాళీ చేసి వెళ్లనున్న ఈ కన్జర్వేటివ్ పార్టీ నేతకు పబ్లిక్ డ్యూటీ కాస్ట్స్ అలవెన్స్ (పీడీసీఏ) నుంచి లభించనుంది. ఈ పీసీడీఏను మాజీ ప్రధానులు తమ జీవితం సౌకర్యవంతంగా గడిపేందుకు ఈ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాజీ ప్రధానులు తాము చేపట్టిన ప్రజావిధులను కొనసాగించడానికి ఈ చెల్లింపులు లభించనుంది. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ 1990లో తన పదవికి రాజీనామా చేసిన తర్వాత, ప్రధానమంత్రి పదవిని 1991లో చేపట్టిన జాన్ మేజర్ ఈ అలవెన్స్ ఏర్పాటు చేశారు. ఈ స్కీమ్‌ను ప్రారంభించిన తర్వాత పలువురు మాజీ ప్రధానులు పబ్లిక్ లైఫ్‌లో తమ ప్రత్యేక హోదాను నిలబెట్టుకోవడానికి మిలియన్ల కొద్దీ పౌండ్లను అందుకున్నారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతిఏటా అలవెన్స్ పొందుతున్న జీవించి ఉన్న మాజీ ప్రధానుల్లో లిజ్‌ట్రస్ ఆరో వ్యక్తి. ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్ లిజ్‌ట్రస్ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ పాలసీ మరింత అధోగతి పాలు చేసిది. డాలర్‌తో పోలిస్తే, పౌండ్ మారక