Saturday, November 23, 2024

Kejriwal | కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టేసిన గోవా కోర్టు

కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. దాదాపు 7 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ కేసును తాజాగా కోర్టు కొట్టివేసింది. 2017 గోవా ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అప్పుడు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే తాజాగా విచారణ జరిపిన గోవాలోని మపుసా కోర్టు.. ఆ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.

2017 లో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓ భారీ బహిరంగ సభలో ‘‘అన్ని పార్టీలు, అభ్యర్థుల దగ్గర డబ్బులు తీసుకోండి.. ఓటు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే వేయండి’’ అని అరవింద్ కేజ్రీవాల్ ఆ బహిరంగ సభ నుంచి గోవా ఓటర్లకు సూచించారు. దీంతో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ గోవా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ వ్యాఖ్యలకు లంచానికి సంబంధించిన కేసు అరవింద్ కేజ్రీవాల్‌పై నమోదైంది. ఈ కేసుకు సంబంధించి గతేడాది నవంబర్‌లో అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేశారు. ఏడేళ్లపాటు సాగిన ఈ కేసుపై శనివారం కీలక తీర్పు వెల్లడించిన గోవాలోని మపుసా కోర్టు కేజ్రీవాల్‌పై దాఖలైన ఎఫ్ఐఆర్‌ను తిరస్కరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement