Tuesday, November 19, 2024

డిజిటల్‌ చెల్లింపులు భారీ జంప్‌.. 2026-27 నాటికి యూపీఐలో 90 శాతం రిటైల్‌ చెల్లింపులు

దేశంలో యూపిఐ లావాదేవీలు వేగంగా పెరుగుతున్నాయి. 2026-27 నాటికి రోజుకు వంద కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతయాని పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక వెల్లడించింది. ది ఇండియన్‌ పేమెంట్స్‌ హ్యాండ్‌బుక్‌ 2022-27 పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో 90 శాతం రిటైల్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ ఉంటాయని తెలిపింది. 2022-23 సంవత్సరంలో మొత్తం యూపిఐ చెల్లింపుల్లో రిటైల్‌ డిజిటల్‌ చెల్లింపులు 75 శాతంగా ఉన్నాయి.

భారత డిజిటల్‌ మార్కెట్‌ 50 శాతం చొప్పున వృద్ధి చెందుతున్నది. 2022-23లో 103 బిలియన్‌ లావాదేవీలు జరిగాయి. ఇవి 2026-27 నాటికి 411 బిలియన్‌ లావాదేవీలకు పెరుగుతాయని నివేదిక అంచనా వేసింది. 2026-27 నాటికి రోజుకు 1 బిలియన్‌ యూపీఐ లావాదేవీలు జరుగుతాయని పేర్కొంది. 2022-23లో 379బిలియన్ల యూపీఐ లావాదేవీలు నమోదు అయ్యాయని, ఇవి 2026-27 నాటికి 83.71 బలియన్ల లావాదేవీలకు పెరిగుతాయని ఈ నివేదిక అంచనా వేసింది.

యూపీఐ తరువాత ఎక్కువ లావాదేవీలు క్రెడిడ్‌, డెబిట్‌ కార్డు ద్వారా జరుగుతున్నాయి.దేశంలో క్రెడిట్‌ కార్డుల వృద్ధి స్థిరంగా కొనసాగుతున్నది. 2024-25 నాటికి దేశంలో డెబిట్‌ కార్డు చెల్లింపుల కంటే క్రెడిట్‌ కార్డు ద్వారా జరిపే చెల్లింపులు పెరుగుతాయని పేర్కొంది. వచ్చే ఐదు సంవత్సరాల్లో క్రెడిట్‌ కార్డుల జారీ 21 శాతం చొప్పున పెరుగుతుందని అంచనా వేసింది. ఇదేకాలంలో డెబిట్‌ కార్డుల వృద్ధి 3 శాతంగా ఉంటుందని తెలిపింది. డెబిట్‌ కార్డుల వినియోగం తగ్గడానికి ప్రధానంగా వాటిని క్యాష్‌ విడ్‌డ్రా కోసం ఉపయోగిస్తున్నారని, ప్రస్తుతం ఎక్కువగా యూపీఐ ద్వారానే క్యాష్‌ విత్‌డ్రా జరుగుతుందని పేర్కొంది.

- Advertisement -

రానున్న ఐదు సంవత్సరాల్లో పేమెంట్‌ ఇండస్ట్రీ ఎక్కువగా ఎకోసిస్టమ్‌ విస్తరణపై దృష్టి సారించే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ ఇండియా పార్టనర్‌, పేమెంట్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ లీడర్‌ మిహిర్‌ గాంధీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌ల కోసం కొత్త వినియోగ కేసులపై దృష్టి సారిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఎంబెడెడ్‌, ఎకోసిస్టమ్‌ ఫైనాన్స్‌ చెల్లింపుల లావాదేవీలు, ఆఫ్‌లైన్‌ చెల్లింపుల ఆధారంగా డిజిటల్‌ రుణాలు ఇవ్వడం వంటి రంగాలు చెల్లింపుల పరిశ్రమ తదుపరి దశ వృద్ధికి దారితీస్తాయని చెప్పారు.

ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న భారతీయ చెల్లింపుల ల్యాండ్‌స్కేప్‌ అవిష్కరణలు, ఎలాంటి అడ్డంకులు లేఇన డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్థకు మార్గం సుగమం చేస్తున్నాయని గాంధీ అభిప్రాయపడ్డారు. మొత్తం కార్డుల ఆదాయంలో క్రెడిట్‌ కార్డుల అదాయం 76 శాతం వుంటుందని పిడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. 2022-23 సంవత్సరంలో బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు, ఫిన్‌టెక్‌ సంస్థలకు క్రెడిట్‌ కార్డుల ఆదాయం లాభదాయకంగా ఉందని తెలిపింది. 2021-22 సంవత్సరంతో పోల్చితే 2022-23లో క్రెడిట్‌ కార్డుల ద్వారా వచ్చే ఆదాయం 42 శాతం పెరిగింది. ఇది వచ్చే ఐదు సంవత్సరాల్లో 33 శాతం పెరుగుతుందని ఈ ని వేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement