Friday, November 22, 2024

జాలరు పంటపడింది..ఒక్క చేప 72 లక్షలు..

పాకిస్థానీ మత్స్యకారుడు సాజిద్‌ హాజీ అబు బకర్‌ పంట పండింది. ఆసియా, యూరప్‌ దేశాల్లో అత్యధిక గిరాకీ ఉన్న అత్యంత అరుదైన చేప ‘అట్లాంటిక్‌ క్రోకర్‌’ అతడి వలలో పడింది. చిన్నా చితక  చేప కాదది. ఏకంగా 48 కిలోల బరువైన భారీ మత్స్యరాజం. దాన్ని అతడు అక్షరాలా 72 లక్షల రూపాయలకు విక్రయించాడు. అసలైతే వేలంలో ఆ చేప రూ.86.4 లక్షలు పలికిందిగానీ.. తమ సంప్రదాయాల ప్రకారం కొంచెం డిస్కౌంట్‌ ఇవ్వడంతో ఫైనల్‌గా రూ.72 లక్షలు ముట్టినట్టు సాజిద్‌ చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement