దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం అర్దరాత్రి శాస్త్రి పార్కులోని ఫర్నీచర్ మార్కెట్లో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. భారీ మంటలు చెలరేగడంతో సుమారు 250 హార్డ్‌వేర్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ విషయమై ఫైర్ సర్వీసెస్ అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ రాజేశ్ శుక్లా మాట్లాడుతూ. ‘ఉదయం 12:45 గంటలకు మంటలు సంభవించాయి. మార్కెట్‌లో 250 ఫర్నిచర్ & హార్డ్ వేర్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. 32 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకొని తెల్లవారుజామున 3 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చాయి’ అని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement