ముంబై మహానగరంలోని ఓషివారా ప్రాంతంలోని ఓ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగి ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. మరో ఎనిమిది వాటర్ ట్యాంకర్లను తరలించారు. అంబులెన్స్‌ను సైతం అందుబాటులో ఉంచగా.. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
ఓషివారా రిలీఫ్ రోడ్‌లోని ఉన్న ఆషియానా టవర్లోని మొదటి ఫ్లోర్‌లో ఉదయం 7:57 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్ని ప్రమాదంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రాంతంలో భారీగా పొగ కమ్మేసింది. పక్కనున్న భవనాల వాసులు సైతం అప్రమత్తమై ఇండ్ల నుంచి బయటకు వచ్చారు.