Friday, November 22, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు – ప్రాధాన్య‌త ఓట్లే కీల‌కం..

హైదరాబాద్‌, : సాధారణ ఎన్నికలకు భిన్నంగా జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు కొత్త వ్యూహాలకు పదునుపెట్టారు. భారీగా అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ప్రాధాన్యత ఓట్లు కీలకంగా మారబోతున్నాయి. ఒకటి, రెండు అంకెలతోనే జాతకాలు మారిపోతాయి. తొలి ప్రాధాన్య ఓట్లు పూర్తిస్థాయిలో దక్కక రెండో ప్రాధాన్య ఓట్లతోనే.. గట్టెక్కిన అభ్యర్థులే గతంలో అధికం. ఈ క్రమంలో ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీలకు ప్రధాన పార్టీలు తెరతీశాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తిగా బ్యాలెట్‌ పద్ధతిలో జరిగే ఎన్నికలు. తమకు నచ్చిన అభ్యర్థికి ఒకటి లేదా రెండు ఇలా అంకెలు వేస్తారు. వీటినే ప్రాధాన్య ఓట్లుగా పరిగణిస్తారు. ప్రసు ్త తం రాష్ట్రంలో జరుగుతున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా బలంగా ఉన్నారు. సాధారణంగా చెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్య ఓట్లు సగాని కంటే ఒకటి ఎక్కువ వస్తే విజేతగా ప్రకటిస్తారు. అలా రాకపోతే ద్వితీయ ప్రాధాన్య ఓట్లను కౌంట్‌ చేస్తారు. అక్కడా ఫలితం తేలకపోతే మూడో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. అయినా కొలిక్కి రాకపోతే నాలుగో ప్రాధాన్య ఓట్లను పరి గణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కల చిట్టా తేలిన తర్వాతే విజేతను ప్రకటిస్తారు.
మొదటి ప్రాధాన్య ఓటు ఒక్కటే చాలు
ఈ దఫా ప్రధాన పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులు ఉత్సాహంగా నామినేషన్లు వేశారు కానీ.. ప్రాధాన్య ఓట్లను తలచుకుని టెన్షన్‌ పడుతున్నారు. బ్యాలె ట్‌లో ఒకటి, రెండు అంకెలు జాతకాలను మార్చే ప్రమాదం ఉండడంతో అప్రమత్తతతో వ్యవహరిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు మొదటి ప్రాధాన్య ఓట్లు వేసేవారు ద్వితీయ ప్రాధాన్యం ఎవరికి ఇస్తారన్నది కీలకం. అందుకే ఎవరికి వారుగా ఎక్కువ మొదటి ప్రాధాన్య ఓట్లు తమకే పడేలా ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే మొదటి ప్రాధాన్య ఓటు వేసి.. మిగతా ప్రాధాన్య ఓట్ల జోలికి వెళ్లొద్దని ఆయా పార్టీలు తమ కార్యకర్తలకు ఇప్పటికే స్పష్టం చేశాయి. కాకపోతే స్వతంత్ర అభ్యర్థులతో మాట్లాడుకుని.. ద్వితీయ ప్రాధా న్యం ఓట్లు తమకు పడేలా ఒప్పందం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈసారి రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఐదేసి లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు జిల్లాల పరిధిలో ఉండటంతో ఎక్కువ మంది ఓటర్లన కలవడం సాధ్యమయ్యే పని కాదు. ఉన్నంతలో నల్లగొండలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి ఎక్కువ ప్రాం తాల్లో పర్యటిస్తే, హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి రామచందర్‌ రావు ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించారు. అన్ని ప్రాంతాలు కవర్‌ చేయలేని అభ్యర్థులు, ఎందుకైన మంచిదని అన్ని అవకాశాలు వాడుకుంటున్న అభ్యర్థులు స్వతం త్రులతో కొంత కథ నడిపించే పనిలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. గత ఎన్ని కల్లో హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. నల్గొండ – ఖమ్మం – వరంగల్‌ పట్టభద్రులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు రాకపోవడంతో.. రెండో ప్రాధాన్య ఓట్లతో గెలిచారు. కరీంనగర్‌లో టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి ఏకంగా ఆరో ప్రాధాన్య ఓట్లను కలిపిన తర్వాతే గట్టెక్కారు. అందుకే ఈ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులకు విజయం నల్లేరుపై నడక కాదని, ప్రాధాన్యత ఓట్లతో ఏమైనా జరగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement