ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. సర్వర్ డౌన్ కావడంతో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యలతో యాజర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క సారిగా వాట్సాప్ సేవలు ఆగిపోవడంతో జనాలు కంగారుకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా కాసేపట్లో సర్వీసులు పునరుద్ధరిస్తామని అఫీషియల్స్ అంటున్నారు. సర్వర్ డౌన్ కావడంతో వాట్సాప్ కమ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోయినట్లు తెలిపారు. గతంలోనూ ఇలాంటి ఇబ్బందులు కలిగినట్లు గుర్తు చేశారు. 40 నిమిషాలు పాటు పనిచేయని వాట్సాప్. మేసేజ్‌లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్లూ టిక్ మార్క్ కూడా రావడం లేదు. స్టేటస్‌లు కూడా అప్‌లోడ్ కావడం లేదు. దీంతో వాట్సాప్ డౌన్‌తో యూజర్లలో అయోమయం నెలకొంది. వాట్సాప్ కాల్స్ పోకపోవడంతోఆందోళన చెందుతున్నారు.
BIG BREAKING : వాట్సాప్ సేవలకు బ్రేక్.. ఆందోళనలో వినియోగదారులు..
Advertisement
తాజా వార్తలు
Advertisement