హైదరాబాద్ లోని దమ్మాయిగూడలో బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతంగా మారిన విషయం విధితమే. బాలిక ఇందు పోస్టుమార్టం రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. బాలిక ఊపిరితిత్తుల్లోకి నీరు చేరినట్లు వైద్యులు గుర్తించారు. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, చెరువు నీరు మింగడంతో చనిపోయినట్టు పోస్ట్‌మార్టం రిపోర్టులో నిర్ధారణ అయ్యింది. బాలిక చెరువులో ఎలా పడిందన్న దానిపై ఇంకా స్పష్టతరాకపోవడంతో ఈ కేసు మిస్టరీగానే మిగింలింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. మరో పక్క దమ్మాయిగూడ చౌరస్తాలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. బాలిక ఇందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం నివేదికను తమకు ఇవ్వాలని, ఇందు మృతిపై క్లారిటీ ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ఇందు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులతోపాటు పలు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Big Breaking : ఇందు పోస్టుమార్టం నివేదిక విడుదల.. కీలక అంశాలు వెలుగులోకి…
Advertisement
తాజా వార్తలు
Advertisement