శశిథరూర్ పై భారీ అథిక్యంతో గెలుపొందారు ఖర్గే. కాగా ఖర్గేకు 7,897 ఓట్లు వచ్చాయి. కాగా శశిథరూర్ కి 1,072ఓట్లు వచ్చాయి.6,800లకి పైగా మెజార్టీతో ఖర్గే విజయం సాధించారు. దాంతో కాంగ్రెస్ అధ్య క్షుడిగా మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. ఈ మేరకు ఏఐసీసీ కొత్త అధ్య క్షుడిగా మల్లికార్జున ఖర్గే నియామకం జరగనుంది. కాగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆ పార్టీ నేత, అధ్యక్ష అభ్యర్థి శశిథరూర్ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగా చాలా అవకతవకలు జరిగాయని చెప్పారు. ఓట్ల లెక్కింపులో యూపీ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మిస్త్రీని కోరారు. ఈ విషయంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు శశిథరూర్ తెలిపారు. మిస్త్రీ కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నట్లు శశిథరూర్ తరఫున ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ సజ్ పేర్కొన్నారు. పోలింగ్ లో జరిగిన అవకతవకలపై మిస్త్రీ నోటీసుకు తీసుకెళ్లినట్లు వివరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement