ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంకలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఆయన దేశం విడిచి పరారయ్యారు. కాగా శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. దీంతో శ్రీలంక దేశ 8వ కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికైనట్లు అధికారిక ప్రకటన వెలువడింది. 219 ప్రజాప్రతినిధుల ఓట్లు ఉండగా అందులో రణిల్ విక్రమసింఘె ఏకంగా 134 ఓట్లు సాధించారు. దీంతో శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘె ఎన్నికయ్యారు. ఆయన త్వరలోనే శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. రణిల్ విక్రమసింఘె.. ఆ దేశ ప్రధానిగా పని చేశారు. రీసెంట్ గా ఆ పదవికి రణిల్ విక్రమసింఘె రాజీనామా చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement