బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. కంటెస్టెంట్స్ పట్ల స్ట్రిక్ట్ గా వ్యవహరించే బిగ్ బాస్.. యానీ మాస్టర్ ని నామినేషన్ నుండి తప్పిస్తున్నారేమో అనిపిస్తోంది. కాగా కంటెస్టెంట్లకి చిత్ర విచిత్రమైన టాస్క్ లు ఇస్తూ..హౌస్ మేట్స్ మధ్య గొడవలు సృష్టిస్తున్నాడు బిగ్ బాస్. ఇదిలా ఉంటే ఈ వారంలో ఇంట్లో పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. కెప్టెన్ షణ్ముఖ్ తప్పా మిగిలిన అందరూ నామినేషన్ లోకి వచ్చారు. అయితే వీరికి ఓ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్ నామినేషన్ నుంచి ఒకరు తప్పించుకునే అవకాశాన్ని ఇచ్చారు.బ్యాగేజ్ జోన్.. సేఫ్ జోన్.. డేంజర్ జోన్.. అంటూ మూడు భాగాలుంటాయి. బ్యాగేజ్ జోన్లో కంటెస్టెంట్ల ఫోటోలతో బ్యాగులుంటాయి.
కాగా ఆ బ్యాగ్ తీసుకుని పరిగెత్తుకుంటూ సేఫ్ జోన్లోకి రావాలి. అలా ఎవరైతే చివరకు వస్తారో వారు డేంజర్ జోన్లోకి వస్తారు. చివరన వచ్చిన కంటెస్టెంట్‌తో పాటుగా వారి చేతిలో ఎవరి బొమ్మ ఉన్న బ్యాగ్ ఉంటుందో వారు కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే లెక్క. అలా ప్రతీ రౌండ్ లో ఎవరో ఒకరు ఆట నుంచి పక్కకు తప్పుకుంటారు. ఒకరి సేఫ్ అవుతుంటారు. ఈ గేమ్ లో ఆనీ మాస్టర్ విన్ అయ్యారు. అయితే గత వారం ఆనీ మాస్టర్‌కు వచ్చిన పవర్‌ను వాడే సమయం వచ్చిందని చెప్పాడు బిగ్ బాస్ దాంతో ఒకరిని నామినేషన్ నుంచి తప్పించవచ్చని అన్నాడు దాంతో మానస్ ను నామినేషన్ నుంచి తప్పించింది ఆనీ మాస్టర్ ఇలా ఆ ఇద్దరు బయట పడ్డారు. మరి ఆనీ మాస్టర్ కి స్పెషల్ పవర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే అంశంపై నెటింట్లో తెగ చర్చ జరుగుతోంది.