ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌బాస్-5 సీజన్ త్వరలోనే ప్రారంభం అవుతోంది. కరోనా వల్ల వాయిదాపడుతూ వస్తున్న ఈ షో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. అయితే గత సీజన్ కంటే ఈ సీజన్‌ను కాస్త డిఫరెంట్‌గా జరపాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సీజన్‌కు హోస్టుగా మరోసారి నాగార్జున వ్యవహరిస్తారని సమాచారం. ఇక ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెంస్టెంట్స్ అంటూ కొందరి పేర్లు బయటకు వచ్చాయి.
జాబితా: యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, హీరోయిన్ ఇషా చావ్లా, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: గత నెలలో తిరుమలకు పెరిగిన భక్తుల తాకిడి