Monday, November 18, 2024

ఉజ్జయిని మహంకాళి బోనాలకు భారీ ఏర్పాట్లు : మంత్రి తలసాని..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. ఈనెల 17 నుంచి ఉజ్జయిని అమ్మవారి బోనాలు, 18న రంగం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, మహమూద్‌ అలీలతో కలిసి మంత్రి తలసాని బోనాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..

బోనాల ఉత్సవాలు అంటే ఒకప్పుడు హైదరాబాద్‌ నగరానికే పరిమతమైనాయని, ఇప్పడు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది బోనాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందన్నారు. గతం కంటే ఈ ఏడాది బోనాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. బోనాల నేపథ్యంలో రూ.100 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement