Friday, November 22, 2024

చైనాకు బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయ‌న అమెరికా ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికా – చైనా మధ్య బెలూన్ వార్ నేపథ్యంలో జో బైడెన్ ఈ హెచ్చరిక చేశారు. పరిణామాలను ఊహించలేరంటూ జో బైడెన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చైనాతో ఉన్న బెలూన్ వార్ పై బైడెన్ స్వయంగా రంగంలోకి దిగారు.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌మ దేశానికి ఎన్నో స‌వాళ్లు ఉన్నాయ‌ని, గ‌త రెండేళ్ల‌లో ప్ర‌జాస్వామ్యాలు బ‌ల‌ప‌డ్డాయ‌ని, కానీ బ‌ల‌హీన‌ ప‌డ‌లేద‌ని బైడెన్ తెలిపారు. అమెరికా ప్ర‌యోజ‌నాల కోసం చైనాతో క‌లిసి ప‌నిచేసేందుకు ఆస‌క్తిగా ఉన్నామ‌న్నారు. స్టేట్ ఆఫ్ ద యూనియ‌న్‌లో బైడెన్ ప్ర‌సంగించ‌డం ఇది రెండోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement