- కాల్పుల కలకలం
హైదరాబాద్ లోని అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు కలకలం రేగింది. బీదర్‌లో ఏటీఎం చోరీకి పాల్పడిన దుండగులు అఫ్జల్‌గంజ్‌లో బీభత్సం సృష్టించారు.
కర్నాటకలోని బీదర్‌లో పట్టపగలు కాల్పులు జరిపి ఏటీఎం వ్యాన్‌లోని డబ్బును దోచుకుని పారిపోయిన దొంగలు హైదరాబాద్‌లో ప్రత్యక్షమయ్యారు. వీరి సమాచారం అందుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపులు మొదలుపెట్టారు.
ఈ క్రమంలో అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిగాయి. అఫ్జల్‌గంజ్ పోలీసులపై దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. పారిపోయిన దొంగల కోసం పోలీసుల గాలిస్తున్నారు.
- Advertisement -