Saturday, November 23, 2024

Vande Bharat | భువనేశ్వర్-విశాఖ వందేభారత్ టిక్కెట్ ధర వివరాలివే !

ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో భువనేశ్వర్-విశాఖ-భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 12న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇక ఈ నెల 17 నుంచి ఐఆర్ సీటీసీలో టిక్కెట్లు అందుబాటులోకి రానున్నాయి. కాగా తాజాగా ఈ ట్రైన్ టికెట్ ధర వివరాలను అధికారులు వెల్లడించారు.

ఈ 8 కోచ్‌ల రైలు భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య 443 కి.మీ దూరాన్ని దాదాపు 5:45 గంటల్లో కవర్ చేస్తుంది. అన్ని వందే భారత్ రైళ్ల మాదిరిగానే ఈ రైలులో కూడా AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉన్నాయి. భువనేశ్వర్‌ నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ఏసీ చైర్‌కార్‌ చార్జీ రూ.1,115 కాగా.. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ. 2,130 గా నిర్ణయించారు. తిరుగు ప్రయాణానికి ఏసీ చైర్ కార్ టికెట్ ధర రూ.1,280, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.2,325గా నిర్ణయించారు.

ఇక ఈ రైలు (20841/20842) సోమవారం మినహా మిగిలిన ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం 5:15 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి ఉదయం 11:30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరి రాత్రి 9:55 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement