భారత ప్రధాని మోడీ నవంబర్ 15న భోపాల్‌లో 4 గంటలు పర్యటించనున్నారు. ఇందుకు రూ. 23 కోట్లకు పైగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సభకు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న గిరిజనులను తరలించేందుకు రూ. 13 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా మోదీ హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దేశంలోనే తొలిసారిగా పబ్లిక్, ప్రయివేటు పార్ట్‌నర్‌షిప్‌లో ఈ స్టేషన్‌ను నిర్మించారు.
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జమ్‌బూరీ మైదాన్‌లో నిర్వహించే జన్ జాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా జ్ఞాపకార్థం గిరిజనులు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
భోపాల్ లో మోడీ పర్యటన ఖర్చు రూ. 23 కోట్లు
Advertisement
తాజా వార్తలు
Advertisement