హైదరాబాద్, ఆంధ్రప్రభ : బోయిగూడలో విషాదం నింపిన అగ్ని ప్రమాదం వెనుక సంచలన విషయాలు వెలుగు చూశాయి. 11 మంది కార్మికులు సజీవ ద#హనమైన ఈ అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాద ఘటనను త్రీడీ స్కానర్‌తో క్లూస్ టీంలు పరిశీలించాయి. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించారు. షార్ట్ సర్క్యూట్‌తో ఎగిసిపడిన నిప్పు రవ్వల కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. దీంతో స్క్రాప్ గోదాంలో మంటలు అంటుకోవడం ద్వారా కరెంట్ బోర్డులు సిలిండర్ పేలుడు సంభవించినట్టు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఫ్యూజ్‌లే కొంపముంచాయా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒక్కో ఫ్యూజ్‌లో అదనంగా మందమైన మూడు, నాలుగు వైర్లు ఉన్నట్టు గుర్తించారు. కేబుల్ వైర్లు ప్లాస్టిక్ వైర్లపై నిప్పు రవ్వలు పడడం స్విచ్ బోర్డులు, గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీ అగ్ని ప్రమాదానికి దారితీసినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఇక స్క్రాప్ గోదాంలో పదికిపైగా స్విచ్ బోర్డులు ఉన్నట్టు గుర్తించారు. గోదాంలో కరెంట్ ఎక్కువ వాడకంతో షార్ట్ సర్క్యూట్ కారణంగా గోదాంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో భారీఎత్తున మంటలు ఎగిసిపడినట్టుగా చెబుతున్నారు. ఇనుప మెట్లు ఉండడంతో పైనున్న వారు కిందకు రాలేకపోయారని.. దట్టమైన పొగవల్ల సృహ కోల్పోయి మంటల్లో సజీవ దహనమైనట్టు నిర్ధారణకు వస్తున్నారు. అగ్నిప్రమాదం గ్యాస్ పేలుడు ధాటికి రేకులు పేలిపోయాయి. సిలిండర్ రెగ్యులేటర్ పక్కనే ఉన్న మరో షెడ్‌పై పడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్ పిన్ సైతం సిలిండర్‌లోకి వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. క్లూస్‌టీం విచారణలో ఈ విషయాలు నిగ్గు తేలినట్టు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..