ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలి పెళ్లికి ముహుర్తం ఖరారైంది. కానీ ప్రియుడు మాత్రం ఏం చేయలేని పరిస్థితి. పెళ్లిని ఆపేంత ధైర్యం కూడా లేదు. దీంతో ఏకంగా ఆ ప్రియుడు ముఖ్యమంత్రికే ట్వీట్ చేసి నెట్టింట్లో వైరల్ అయ్యాడు.
అయితే మే 13వ తేదీన బీహార్ సీఎం ట్వీట్ చేస్తూ.. లాక్‌డౌన్ విధించడం వల్ల సానుకూల ఫలితాలు వచ్చాయి. కరోనా పాజిటివ్ కేసులు తగ్గాయన్నారు. ఈ క్రమంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు తెలిపారు. మే 16 నుంచి 25వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై ఓ యువకుడు స్పందిస్తూ.. సార్.. మీరు పెళ్లిళ్లలపై నిషేధం విధిస్తే.. మే 19న జరగాల్సిన తన ప్రియురాలి పెళ్లి ఆగిపోతోంది. తాను ఎప్పటికీ మీకు కృతజ్ఞుడిగా ఉంటానని అతను తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.