Friday, November 22, 2024

Bheemgal: మ‌హిళ‌కు అరుదైన శస్త్ర చికిత్స..

భీంగల్ టౌన్, జూన్ 12 (ప్రభ న్యూస్ ) : భీంగల్ పట్టణం లోని శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో సోమవారం అరుదైన శస్త్ర చికిత్స చేశారు. పట్టణానికి చెందిన జమున (30) ఏండ్ల మహిళ తీవ్రమైన కడుపు నొప్పితో గత నాలుగు సంవత్సరాల నుండి బాధపడుతుంది. తనకున్న బాధను ఆసుపత్రి లో తెలుపగా దవాఖాన వైద్యులు ఆమెను పరిశీలించి కడుపులో సుమారు 6 కిలోల గడ్డ (కంతి) ఉన్నట్టు నిర్దారణకు వచ్చారు.

అంతకు ముందు నిజామాబాద్‌, ఆర్మూర్ తదితర ప్రాంతాల్లోని దవాఖానల్లో చూయించుకున్న ఫలితం లేకపోయింది. సోమవారం ఆమెను పరిశీలించిన వైద్య బృందం సభ్యులు ఎండీ సాయికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్లు ప్రదీప్తి, సూర్యనారాయణ ఎంఎస్ జనరల్ సర్జన్ జమునకు శస్త్ర చికిత్స విజయవంతగా చేశారు. ఈ చికిత్స ద్వారా కడుపులోంచి సుమారు 6 కిలోల కంతిని తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసి ఆపద నుండి కాపాడిన వైద్య బృందానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆపరేషన్ కార్యక్రమం లో హాస్పిటల్ సిబ్బంది షాబుద్దీన్, హరిత, నందిని గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement