Friday, November 22, 2024

నరేంద్ర మోడీకి భట్టి బహిరంగ లేఖ..

నస్పూర్, ఏప్రిల్ 7 (ప్రభ న్యూస్) : ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నరేంద్ర మోడీకి 30 అంశాలతో కూడిన బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరంపై విచారణ, రాష్ట్రానికి నిధుల కేటాయింపు తరితర అంశాలపై మోడీని ప్రశ్నించారు. మీ 9 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏమిటి ? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలు ఏమయ్యాయి ? కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు.. మీకు కేసీఆర్‎కున్న లోపాయికార ఒప్పందం ఏమిటీ ? కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సహారా, ఈఎస్ఐ కుంభకోణాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు ? అని లేఖలో ప్రశ్నించారు.

కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్న మద్యం కుంభకోణం కేసులో పురోగతి ఎందుకు లేదు? మీకు కేసీఆర్‎కు మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా..? విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు. గిరిజన యూనివర్సిటీ ఏమైంది ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఆయన యాత్రకు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ పాదయాత్రలో భాగంగా భట్టి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, అన్వేష్ రెడ్డి, కత్తి వెంకటస్వామి, కురువ విజయకుమార్, నూకల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement